తెలంగాణ

నకిలీ నోట్ల మార్పిడి హబ్‌గా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: నకిలీ నోట్ల చలామణికి హైదరాబాద్ హబ్‌గా మారింది. నెల రోజుల వ్యవధిలో వివిధ కేసుల్లో 10 మంది నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. కొత్త కరెన్సీ 2 వేలు, 500 నోట్లను జిరాక్స్ కాపీలతో నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నకిలీ నోట్ల చలామణి, నిందితులను గుర్తించేందుకు ఏర్పాటైన నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలోని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటి) నకిలీ నోట్లను సిరిసిల్ల, నిజాంపేట, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించింది. గత నెల 25న రాజేంద్రనగర్ నుంచి 20 లక్షల నకిలీ కరెన్సీని ఎస్‌ఒటి స్వాధీనం చేసుకుంది. రిజర్వు బ్యాంక్ నుంచి పెద్ద నోట్లను తీసుకు వచ్చినట్లు నమ్మించి చలామణిలోకి తెస్తున్నారు. వౌలాలిలో కూడా ఒక నిందితుడిని నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చోట్ల బ్యాంకుల బ్రాంచ్ కార్యాలయాల్లో చలామణి చేస్తుండగా, పెట్రోల్ బం కులు, వైన్ షాపుల వద్ద మరికొన్ని చలామణి అవుతున్నట్లు ఎస్‌ఒటి గుర్తించింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బంజారాహిల్స్, బేగంపేట, టాస్క్ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున పాత పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజుల్లో 15 నుంచి 17 కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి.