తెలంగాణ

ప్రజారోగ్యానికి నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రాష్ట్రప్రభుత్వా లు రాష్ట్ర స్ధూల జాతీయోత్పత్తిలో వైద్య, ఆరోగ్య శాఖకు చేస్తున్న కేటాయింపుల వాటాను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ రాష్ట్రప్రభుత్వాలను కోరిం ది. 2025 నాటికి జిడిపిలో ఆరోగ్య, వైద్య శాఖ వాటా 1.15 శాతం నుంచి 2.5 శాతానికి పెరగాలని కోరింది. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇకపై ఆరోగ్య రంగానికి పెట్టే ఖర్చులను ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి సూచికలను నిర్ణయిస్తామని పేర్కొంది. వైద్య రంగం సూచిక తక్కువగా ఉంటే కొంత కాలం పాటు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు జాతీయ ఆరోగ్య విధానంలో కేంద్రం ప్రకటించింది. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ జలాని ఈ లేఖ రాశారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు ఔషధాలు, ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వాలు విధి విధానాలు ఖరారు చేయాలి. ప్రతి కుటుంబం తమ ఆదాయంలో 25 శాతం ఆరోగ్యానికి ఖర్చుపెడుతున్నారని, ఇది పెరగడం మంచిది కాదన్నారు. 2025 నాటికి ప్రజారోగ్య వ్యవస్ధలను ప్రజలు 50 శాతం వరకు వినియోగించుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. కేంద్రం త్వరలో ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డును ప్రవేశపెట్టాలని యోచిస్తోందని, దీని కింద ఒక సారి కార్డు వివరాలనుచూస్తే ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలుస్తుంది. ఈ విధానానికి ఆసక్తి చూపించే రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాలు, లేదా నగరాల్లో ప్రయోగాత్మకంగా ఆరోగ్య కార్డును ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 నాటికి టిబి వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రక్రియలో రాష్ట్రాలు భాగస్వాములు కావాలని కేంద్రం సూచించింది. కాలాఅజార్, లింఫటిక్ ఫైలేరియా వ్యాధులు 2017కు, కుష్టురోగం 2018 నాటికి దేశంలో నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా, తాలూ కా స్థాయి ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను పెంచాలని, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించాలన్నారు. 2020 నాటికి మంచినీరు, మరుగుదొడ్లు స్కీంపై కేంద్రం వివరించింది. ప్రస్తుతం దేశంలో 48శాతం మందికి మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. 2019 నాటికి శిశుమరణాల రేటును ప్రతి వెయ్యికి 28కి, ఐదు సంవత్సరాల లోపుపిల్లల మరణాల రేటును ప్రతి వెయ్యికి 23కు తగ్గించాలని కేంద్రం కోరిం ది. ప్రస్తుతం దేశంలో శిశుమరణాల రేటు ప్రతి వెయ్యికి 41గా ఉంది. కాగా 10 ఏళ్ల క్రితం ఈరేటు 56శాతం ఉండేది.
అర్బన్ హెల్త్ సేవల్లో రూ.700 కోట్ల కోత
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5920.27 కోట్ల నిధులు కేటాయించింది. 2016-17లో రూ. 5585.49 కోట్లు, 2015-16లో రూ.3655.12 కోట్లను కేటాయించింది. అర్బన్ హెల్త్ సర్వీసులకు 2015-16లో రూ.2013.22 కోట్లు, 2016- 17లో రూ.3031.05 కోట్లను ఖర్చుపెట్టారు. వచ్చే ఏడాది బడ్జెట్‌పై కోతలు విధించారు. రూ.2353.15కోట్లను కేటాయించారు. రూరల్ హెల్త్ సర్వీసుల బడ్జెట్‌ను విశే్లషిస్తే 2015-16లో రూ. 1641.90 కోట్లు, 2016- 17లో రూ.2554.44 కోట్లు ఖర్చుపెట్టారు. వచ్చే ఏడాది ఈ రంగానికి రూ. 3567.12 కోట్లు కేటాయించారు.