తెలంగాణ

లాకప్‌డెత్‌పై న్యాయవిచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట, మార్చి 19: హైదరాబాద్‌లోని రహీంపుర ప్రాంతానికి చెందిన భీంసింగ్‌ను లాకప్‌లో పోలీసులు హింసించడం వల్ల అతను చనిపోయాడనే అభియోగాలపై న్యాయ విచారణ జరిపించాలని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. భీంసింగ్ (42) శనివారం మంగళ్‌హాట్ పోలీస్టేషన్‌లో లాకప్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆదివారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌లాల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌యాదవ్ తదితరులు ఉస్మానియా ఆసుపత్రిలో భీంసింగ్ భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తంకుమార్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గానికి చెందిన భీంసింగ్‌ను లాకప్‌డెత్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీంసింగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. భీంసింగ్ మరణంతో ఆ కుటుంబం వీధిన పడిందని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూమ్ స్కీంలో ఇల్లు కేటాయించి, ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.