తెలంగాణ

మోదీకి గొర్రెనిచ్చి గొంగళి కప్పుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: కుల వృత్తులకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం చేపట్టనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసన సభలో పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్రెల పెంపకం పథకానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరనున్నట్టు చెప్పారు. పశు సంవర్థక శాఖలో 489 ఖాళీలు ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేయనున్నట్టు చెప్పారు. బిజెపి శాసన సభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి గొర్రె పిల్లను బహూకరించి, గొంగళి కప్పి సత్కరించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న గొర్రెల పెంపకం పథకానికి సహకారం అందించాలని కోరనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం పథకాన్ని చేపట్టడం దేశం దృష్టిని ఆకర్శిస్తోందని చెప్పారు. పొరుగు రాష్ట్రంలో తెలంగాణకు గొర్రెలు అమ్మవద్దని ప్రభుత్వం చెబుతోందని, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎవరు ఎవరినీ ఆపలేరని తలసాని తెలిపారు. తెలంగాణలో ఏ రకం గొర్రెలకు అనుకూలం అని చూసి ఆ గొర్రెలను తీసుకురానున్నట్టు చెప్పారు. దక్కనీ రకం, నెల్లూరు రకం గొర్రెలు తెలంగాణకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. అధికారులు గొర్రెల కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించినట్టు తెలిపారు. 84లక్షల గొర్రెలను రెండేళ్లలో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర సంస్థ ఎన్‌సిడిసి గొర్రెల పెంపకానికి రుణం ఇస్తుందని చెప్పారు.