తెలంగాణ

‘్భగీరథ’ వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి ఈయేడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్మల్‌తోపాటు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, మిషన్ భగీరథ అధికారులు, పనులు చేపడుతున్న ఏజెన్సీ సంస్థల అధికారులతో మిషన్ భగీరథ పనులపై ఆమె సమీక్షించారు. నిర్మల్ జిల్లాలో మిషన్ భగీరథ ప్రైమరీగ్రిడ్ పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయన్నారు. అలాగే సెకండ్‌గ్రిడ్ పనుల పురోగతిపై సెగ్మెంట్ల వారీగా సమీక్షించారు. ఇంటెక్‌వెల్, పైప్‌లైన్‌లు, ఓహెచ్‌బి ఆర్ హెడ్‌వర్క్స్, గేట్‌వాల్స్, పంపుసెట్లు, తదితర పనుల పురోగతిపై జిల్లాల వారీగా అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీచేశారు. వర్షాకాలం రాకముందే వేసవిలో కూలీల సంఖ్యను పెంచి షిఫ్ట్‌లవారీగా జూన్ చివరికల్లా ఇంట్రావెల్ పనులు పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. పనుల పురోగతిపై నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రనిర్మాణ సంస్థలకు ఏమైనా సమస్యలుంటే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరింపచేసుకోవాలని సూచించారు. అనంతరం ఓఎస్‌హెచ్‌ఆర్ ట్యాంక్‌లు, పైప్‌లైన్‌ల నిర్మాణం, ఇంటెక్‌వెల్‌ల పనుల పురోగతిని జిల్లాల వారీగా ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సిఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్