తెలంగాణ

బరితెగించిన వేటగాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం/మహదేవపూర్, మార్చి 20: ఇదేదో సినిమా స్టోరీ అనుకునేరు. కానే కాదు. సాక్షాత్తు జిల్లా అటవీ శాఖాధికారికి ముందస్తుగా అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాల ప్రకారంగా రేంజర్ తన సిబ్బందితో సమాయత్తమై వన్య ప్రాణుల వధ, రవాణా అంశాన్ని ఛేంచడానికి పయనమైన కథ! దట్టమైన దండకారణ్యంగా పేరున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మన్యంలో జరిగిన యధార్థ గాథ! ఏకంగా మారణాయుధాలతో మాటు వేసి మన్యం గుడారాలలో మకాం వేసి అటవీ జంతువుల వేట యథేచ్ఛగా కొనసాగుతుందనడానికి ప్రత్యక్ష తార్కాణం ! అడవి బిడ్డలు ఆహారం కోసం చేసిన వేట కానే కాదు. సాక్షాత్తు వన్యప్రాణులను వేటాడడానికి తుపాకులను వాడడం, అడ్డువచ్చిన అటవీ శాఖాధికారులను ఆఖరికి మట్టుపెట్టడానికి తుపాకీని ఎక్కుపెట్టడం అనేది ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దండకారణ్యంలోకి అడుగుపెట్టాలంటేనే అడవి అన్నలు మావోయిస్టులు ఉంటారని భయపడే ఇతర ప్రాంతవాసులు ఏకంగా దర్జాగా మన్యంలో మకాం వేసి తుపాకులతో వన్య ప్రాణులను వధించడం చూస్తుంటే.. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందనే అనుమానాలు రాక మానవు అని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇందుకు అటవీ శాఖాధికారుల నుంచి చెట్టు పుట్టను పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ అండదండలు లేనిది వన్య ప్రాణుల వధ దందా సాగదనే విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖాధికారికి అందిన మందస్తు సమాచారం మేరకు మహదేవపూర్ రేంజర్ రమేష్‌ను అప్రమత్తం చేసి అంబట్‌పల్లి, సూరారం అటవీ ప్రాంతంలో అనుమానాస్ప్పదంగా కారు సంచరిస్తోందని, దానిని అనుసరించి తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారంగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో రేంజర్ రమేష్ అంబట్‌పల్లి పరిసర ప్రాంతంలో బేస్ క్యాంప్ సిబ్బందితో మకాం వేశారు. అనుకున్నట్లుగానే ఆ కారు రానే వచ్చింది.
ఇక సోమవారం ఉదయం మహదేవపూర్ మండల కేంద్రంలో గల అటవీ శాఖ కార్యాలయంలో రేంజర్ రమేష్ విలేఖరులకు వెల్లడించిన కథనం ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి డిఎఫ్‌ఓ ఆదేశాల మేరకు అంబట్‌పల్లికి వెళ్లగా లెంకలగడ్డ నుంచి ఏపి13 ఏఈ 2752 అనే నెంబర్ గల ఇండికా కారు అతి వేగంగా దూసుకువచ్చింది. ఆపాలని కొద్దిదూరం నుంచే తాము చేసిన ప్రయత్నాలను ముందస్తుగానే పసిగట్టిన కారులోని వాళ్ళు తడబడ్డారని, కారు ఆపడానికి యత్నించినట్లే ఆపి బేస్ క్యాంప్ సిబ్బందిపైకి కారును ఎక్కించడానికి సమాయత్తమయ్యారని వివరించారు. అంతలోనే కారు ముందు కూర్చున్న వ్యక్తి ఒకరు టవల్‌తో చుట్టిన పొడవైన మారణాయుధం (బహుశా పెద్ద తుపాకీ లాంటిది)తో దిగి రేంజర్‌కు ఎక్కుపెట్టి, బెదిరించాడని అటవీశాఖాధికారి వెల్లడించారు. కారు డిక్కీ తెరవాలని ఆదేశించగా, సిబ్బంది పరిశీలించేలోపుననే, హంటర్స్ కారుతో ఉడాయించారని పేర్కొన్నారు. హంటర్స్ పారిపోతుండగా వెంటనే తేరుకున్న తాము వారిని వెంబడించామని, ఈ క్రమంలో అటవీ శాఖ వాహనం కాస్త ధ్వంసమైందని ఆయన వెల్లడించారు. దండకారణ్యంలో ఆరు కిలోమీటర్లు హంటర్స్ కారు వెనుక అటవీ శాఖాధికారుల వాహనం ఛేజింగ్ చేశారు. అంబట్‌పల్లి నుంచి సూరారం, కిష్టారావుపేట, ఏన్కపల్లి షార్ట్‌కట్ రూట్ మీదుగా తిరగి అంబట్‌పల్లి అటవీ మార్గంలో హంటర్స్ కారును వదిలిపారిపోయారని, అందులో నుంచి ఐదుగురు హంటర్స్ మాత్రం పరారయ్యారని సదరు అటవీ శాఖాధికారి పేర్కొన్నారు.
అనంతరం ఆగిన కారును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని, అందులో రెండు చుక్కల దుప్పిలు చనిపోయి ఉన్నాయని తెలిపారు. కారుతో సహా దుప్పిలను స్వాధీనం చేసుకొని, మహదేవపూర్‌లోని అటవీ శాఖ టింబర్‌డిపోకు తరలించామన్నారు. అనంతరం మహదేవపూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ చంద్రభాను, ఎస్‌ఐ ఉదయ్‌కుమార్, పశు వైద్యాధికారి సతీష్ కారు, దుప్పిలను నిశితంగా పరిశీలించారన్నారు. చుక్కల దుప్పిలలో ఒకటి మగ దుప్పి కాగా మరొకటి ఆడదుప్పిగా గుర్తించారన్నారు. ఆడదుప్పి గర్భిణిగా ఉన్నట్లు పశువైద్యాధికారి ధృవీకరించారు. సుమారుగా ఒక్కోటి డెబ్బది కిలోల వరకు బరువున్నట్లుగా పేర్కొన్నారు. దుప్పిలను పోస్ట్‌మార్టమ్ నిర్వహించగా దుప్పిలకు తలకు, కాలుకు రెండుచోట్ల తుపాకీ తూటా దెబ్బలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు దుప్పిలను వేటాడింది ‘ప్రొఫెషనల్ హంటర్స్’ పనేనని సదరు అటవీ శాఖాధికారి స్పష్టం చేశారు. అలాగే కొమ్ములు లేని ఆడ దుప్పిని అలాల్ చేసి ఉండడంతో ఈ పని ఒక వర్గానికి చెందిన వారే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా కారులో అధికారులు నిశితంగా పరిశీలించగా ఒక పొడవాటి కత్తి, ఆధార్ కార్డు, వాహనానికి సంబంధించిన కాగితాలు, వాడిన తుపాకీ బుల్లెట్ లభించినట్లు వదంతులు వెలువడ్డాయి. అధికారులు మాత్రం చిన్న కత్తి, కాగితాలు (దేనికి సంబంధించినవి స్పష్టం చేయలేదు) లభించినట్లు అటవీ శాఖాధికారులు వెల్లడించారు. వన్యప్రాణుల వధకు మారణాయుధాలు వాడిన నేపథ్యంలో ఏ రకం ఆయుధాలను హంటర్స్ వాడి ఉంటారనే విషయాన్ని పోలీసుల సహాయంతో ఛే దిస్తామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని అటవీ శాఖాధికారి రమేష్ తెలిపారు.

చిత్రం.....వేటగాళ్లు వదిలిపెట్టి పోయిన కారు, దుప్పులు, పంచనామా నిర్వహిస్తున్న అధికారులు