తెలంగాణ

సాదా బైనామాల క్రమబద్ధీకరణ త్వరలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణను ఉచితంగా చేస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి మహ్మద్ అలీ పేర్కొన్నారు. సోమవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తాటిపర్తి జీవన్‌రెడ్డి, డికె అరుణ, తమ్మన్నగారి రామ్ మోహన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, క్రమబద్ధీకరణకు సంబంధించి ఇప్పటికే మూడు జీవోలు ఇచ్చామని, ఒకటి వ్యవసాయ భూములకు, రెండోది హెచ్‌ఎండిఎ పరిధిలోని భూములకు, మూడోది రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట ప్రాంతాలకు సంబంధించినవని అన్నారు. భూమి విషయంలో ఎలాంటి వ్యాజ్యాలు లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అంతకు ముందు జీవన్ రెడ్డి మాట్లాడుతూ విధాన నిర్ణయాన్ని ప్రకటించిన ఏడెనిమిది నెలలకు విధివిధానాలను ఇచ్చారని, భూ హక్కుల చట్టం రూపొందించే యోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ వారసులతో ఇబ్బందులు వస్తున్నాయని, వ్యాజ్యాలు లేకుండా చూసేందుకు గ్రామసభలు నిర్వహించాలని అన్నారు. రాం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఈ సమస్యల నుండి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ ఎ సంపత్‌కుమార్ మాట్లాడుతూ జాప్యం జరిగిన కొద్దీ వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. చర్చలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ చట్ట సవరణకు అనుగుణంగా ముసాయిదా తయారుచేయమని నల్సార్ యూనివర్శిటీని కోరామని అన్నారు. గ్రామాల్లో పంచనామా నిర్వహించిన తర్వాతనే నిర్ణయాలను తీసుకుంటున్నామని అన్నారు. మొత్తం సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచామని ఇందులో ఎలాంటి దాపరికాలు లేవని చెప్పారు.