తెలంగాణ

జిఎస్‌టి అమలుతో వాణిజ్య పన్నుల శాఖలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసన సభలో సోమవారం వాణిజ్య పన్నుల శాఖ పద్దుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి తరఫున సమాధానం చెప్పారు. జిఎస్‌టి వచ్చిన తరువాత సిటిఓ, అసిస్టెంట్ కమిషనర్ పరిధి మారుతుందని, సెంట్రల్ ఎక్సెజ్ శాఖ పరిధి, రాష్ట్ర ప్రభుత్వ పరిధి మారుతుందని చెప్పారు. మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయని చెప్పారు. జిఎస్‌టి అమలు తరువాత కొత్త సర్కిళ్ల ఏర్పాటు, ఖాళీల భర్తీ వంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ట్రిబ్యునల్ బెంచ్ కోసం అడిగినట్టు చెప్పారు. వాణిజ్య పన్నుల ద్వారా ఏటా 35వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. పెట్రోల్, ఎక్సైజ్ ఆదాయం కలిపి 15600 కోట్ల రూపాయలు కాగా, వీటిలో ఎక్సైజ్ ఆదాయం 7620 కోట్ల రూపాయలు అని తెలిపారు. జిఎస్‌టి అమలు తరువాత ఆదాయం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడో చెప్పలేమని అన్నారు. వాణిజ్య పన్నుల్లో 2015-16లో 12.85శాతం వృద్ధి రేటు ఉందని, 2016-17లో 15.35 శాతం వృద్ధి రేటు ఉందని చెప్పారు. వాణిజ్య పన్నుల వృద్ధి రేటులో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని కడియం శ్రీహరి తెలిపారు. పలు చర్యలు తీసుకోవడం వల్ల వాణిజ్య పన్నుల ఆదాయం పెరిగిందని, లీకేజీ తగ్గిందని చెప్పారు. జిఎస్‌టిలో దేనికి పన్ను ఏ విధంగా ఉంటుందో తేలిన తరువాత మన ఆదాయం పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది స్పష్టం అవుతుందని చెప్పారు.