తెలంగాణ

అవినీతిని ప్రోత్సహిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రోత్సహిస్తోందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు బడ్జెట్ పద్దులపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రభుత్వం నిధులను మళ్లిస్తోందని, నలుగురైదుగురు కాంట్రాక్టర్లకు వేల కోట్లు అప్పనంగా దోచిపెడ్తోందని ఆరోపించారు. తాగునీటి ప్రాజెక్టులలోనూ, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. ఇంతవరకూ ప్రాజెక్టుల్లో 42 శాతానికి మించి పనులు కాలేదని, అగ్రిమెంట్లు ముగిసే దశకు చేరుకున్నాయని, ఏ విధంగా వాటిని పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాసొమ్మును కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పగించారని ఆరొపించారు. అవినీతి అధికారికి రెండు మార్లు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారని, రాజకీయ అవినీతిని అంతమొందించాలని, అధికారుల అవినీతిని అంతమొందించాలని అన్నారు. టిడిపి సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్పంచ్ దిగువన పనిచేసే సిబ్బంది వేతనం ఎక్కువగా ఉందని, సర్పంచ్‌ల వేతనాలను కూడా పెంచాలని సూచించారు. ప్రతి ఇంటికి పథకాల సమాచారం చేర్చాలని పేర్కొన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. బొగ్గుపై ఆధారపడటం తగ్గించి, సౌరవిద్యుత్ ఉత్పత్తిని పెంచాలని అన్నారు. అన్ని శాఖల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలని సూచించారు.
జాప్యంలేకుండా ప్రాజెక్టులు
జాప్యం లేకుండా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని సున్నం రాజయ్య కోరారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలుచేయాలని, రైతాంగానికి , రైతు కూలీలకు నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు లేవు: రాంమోహన్‌రెడ్డి
ప్రాజెక్టులు లేని జిల్లాలు రెండే ఉన్నాయని, తమ నియోజకవర్గం పరిధిలోని పలు కార్యక్రమాలకు ఆమోదం లభించినా అవి ప్రారంభం కాలేదని పరిగి ఎమ్మెల్యే రాం మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 150 కోట్లతో పరిగిలో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని, దానిని ప్రారంభించాలని,అదే విధంగా 400 కెవి సబ్ స్టేషన్‌ను ప్రారంభించాలని ఆయన కోరారు. నాలుగు లేన్లరోడ్లు పథకానికి కూడా ఆమోదం లభించిందని, దానిని కూడా ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేర్లతో ఉన్న పథకాల పేర్లను మార్చడం భావ్యం కాదని సూచించారు.