తెలంగాణ

అయిదు పట్టణాలకు ఔటర్ రింగ్‌రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: గజ్వేల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, జనగాం పట్టణాలకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డులను మంజూరు చేసినట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల్లో ఆరూరు రమేష్, శ్రీనివాస్‌గౌడ్, చింతా ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలిపారు. గజ్వేల్ పట్టణానికి 223.35 కోట్ల రూపాయలు, ఖమ్మం పట్టణానికి 209 కోట్ల రూపాయలు, మహబూబ్‌నగర్ పట్టణానికి ఔటర్ రింగు రోడ్డు కోసం 96.70 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు చెప్పారు. గజ్వేల్ రింగు రోడ్డు పనులు సాగుతున్నాయని, ఖమ్మం రహదారి పనులకు డిపిఆర్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో పని ప్రారంభించాల్సి ఉందని అన్నారు. అదే విధంగా జనగాం, వరంగల్ ఔటర్ రింగురోడ్డులను నిర్మించనున్నట్టు, వీటికి సంబంధించి డిపిఆర్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు వివిధ పట్టణాల్లో రింగురోడ్ల కోసం 20కోట్ల రూపాయలను రాష్ట్ర ఫ్రభుత్వం ఖర్చు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఔటర్ రింగ్ రోడ్ల ప్రతిపాదన ఉందని చెప్పారు. జాతీయ రహదారుల్లో భాగంగా రింగ్ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉందని చెప్పారు.