తెలంగాణ

సభను కదిలించిన కోతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: శాసన సభను మంగళవారం కోతుల సమస్య కదిలించింది. ఒక దశలో స్పీకర్ మధుసూదనాచారి సైతం జోక్యం చేసుకుని కోతుల బెడద తట్టుకోలేక తమ నియోజక వర్గంలో కొండెంగలను తీసుకు వస్తే కోతులన్నీ కలిసి కొండెంగలపై దాడి చేశాయని చెప్పారు. అధికార పక్షం సభ్యులు సైతం కోతుల సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కోతుల బెడద వల్ల పంటలు దెబ్బతింటున్నాయి, నివారణ చర్యలు ఏం చేపట్టారు అని ప్రశ్నించారు. లేదండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అంటూ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం చెప్పేసరికి సభ్యులు ఒక్కసారిగా లేచి రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ సమస్య ఉందని, చేతికి వచ్చిన పంటను కోతులు ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే సమస్య ప్రస్తావించినట్టు వెంకటరావు తెలిపారు. వన్యప్రాణి చట్టం నుంచి కోతులు, పాములను మినహాయించారని, దీంతో వీటివల్ల కలిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించలేమని మంత్రి అన్నారు. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నకు తగ్గట్టుగా లేదండి, ప్రశ్న ఉత్పన్నం కాదు అని సమాధానం చెప్పినట్టు తెలిపారు. కోతులను హనుమంతుని రూపంగా చూస్తాం కాబట్టి చంపడం లేదని, కోతులను పట్టుకునే వారికి ఒక్కో కోతికి మూడు వందల రూపాయలు చెల్లిస్తున్నట్టు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో కోతుల బెడద ఉంటే నివారణ చర్యలు చేపట్టినా ఫలించలేదని చెప్పారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు లేచి తన నియోజక వర్గంతో పాటు అన్ని నియోజక వర్గాల్లో ఈ సమస్య ఉందని, పంటను నాశనం చేస్తున్నాయని, కొండెంగలను తీసుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని మా నియోజక వర్గంలో కొండెంగలనే కోతులు తరిమి కొట్టాయని చెప్పారు.