తెలంగాణ

ముత్తారం సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 75 లక్షలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ముత్తారంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం అధికారుల నుంచి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి తెప్పించారు. శ్రీరామ నవమి, సీతారామ కళ్యాణంతో పాటు ఏడాది పొడవునా ఈ ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. వచ్చే భక్తులకు సౌకర్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంజూరు చేసిన నిధుల నుంచి ప్రధాన ద్వారాన్ని వెడల్పు చేయడం, యాగశాల, కళ్యాణ మండపం, వంటశాల నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ గుడికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. భద్రాచలం రామాలయం నమూనాలోనే ఈ గుడి ఉంది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించిన తర్వాత అదే రోజు ముత్తారం ఆలయానికి తలంబ్రాలు తీసుకొచ్చి కళ్యాణ నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో స్పందించిన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు. తమ ఆలయానికి ముఖ్యమంత్రి నిధులు మంజురు చేయడం పట్ల ముత్తారం సర్పంచ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.