తెలంగాణ

ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్/ హైదరాబాద్, మార్చి 21: అమాత్యుల మన్నలను పొందేందుకు ట్రాఫిక్ పోలీసులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సైరన్ మోగుతూ బుగ్గ కారు వస్తుందంటే వాటికంటే ముందే నాలుగైదు సార్లు చక్కర్లు గొట్టే పోలీసు వాహనాలు..రోడ్డుకు ఇరువైపుల ఉన్న చిరువ్యాపారులను గాబరా పెడుతూ పక్కకు తోసేయడం..అటు ఇటూ వెళ్లే వాహనాలను నిలిపివేస్తూ హంగామా చేసే పోలీసులకు బిపి పెరిగితే ఏం చేస్తున్నారో వారికే తెలియనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటిదే ఇటీవల మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్న సందర్భంలో ఉప్పల్-నాగోల్ రహదారిలో జరిగిన సంఘటనే తాజా ఉదాహరణ. తోపుడు బండ్లపై పుచ్చకాయల వ్యాపారం చేసుకునే వారిని తరిమికొట్టే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసు అధికారి చేసిన హంగామా చిత్రాలు మంత్రి కెటిఆర్ దృష్టికి వెల్లడంతో ఆయన మనస్సు చలించినట్టుంది. వెంటనే స్పందించి తెలంగాణ డిజిపికి ట్విట్టర్‌లో జూనియర్ అధికారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తూ విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అన్నట్లుగా పరోక్షంగా సూచనలు చేసినట్లు సమాచారం. విఐపిలు సంచరించే ప్రాంతాలలో ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా సమాచారం ఇవ్వడం వల్లే పోలీసులు ఇలా ప్రవర్తించాల్సివస్తోందనేది పోలీసు వర్గాల అభిప్రాయం.

చిత్రం..నాగోల్ రోడ్డులో చిరు వ్యాపారిపై పోలీసు అధికారి వ్యవహరించిన తీరుకు ఇదే నిదర్శనం