తెలంగాణ

ప్లేస్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన విద్యాశాఖ, స్ర్తి శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమావేశంలో మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ తరలింపు వల్ల ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న వసతులు అంగన్‌వాడీ కేంద్రాలకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను గుర్తించి అక్కడకు అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించి, 2017-18 విద్యాసంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటి వరకూ చిన్నపిల్లలకు పౌష్టకాహారం అందించేందుకు మాత్రమే పనిచేశాయని, ఇక నుండి ప్లేస్కూళ్లుగా మార్చేందుకు కావల్సిన ప్రతిపాదనలను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి కావల్సిన వసతి, సౌకర్యాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రస్తుతం చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేక సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల పిల్లలు కూడా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేయడానికి ఏప్రిల్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని, జూన్ 2017 నుండి అంగన్‌వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రాథమిక పాఠశాలల్లో నడిపించేందుకు తగిన చర్యలను చేపట్టాలని అన్నారు. ఆట పాటలతో పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ, పౌష్టికాహారం అందిస్తూ అంగన్‌వాడీలు ప్లేస్కూళ్లుగా పనిచేస్తాయని అన్నారు. ఎస్సీఇఆర్‌టి నిబంధనల మేరకు ప్లే స్కూళ్లను నడిపే విధంగా అధికారులకు కావల్సిన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రులు ఆదేశించారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విద్యాశాఖ, స్ర్తి శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమావేశంలో పాల్గొన్న మంత్రులు కడియం, తుమ్మల