తెలంగాణ

వేద వాఙ్మయానికి పూర్వ వైభవం తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: వేద వాఙ్మయానికి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని భారత్ టుడే కార్యాలయానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా వచ్చి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. స్వామిజీకి పట్టు వస్త్రాలు, పూలు సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ఆయనతో గంటా 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు.
ఇరువురి మధ్యా ఆధ్యాత్మిక అంశాలతోపాటు వర్తమాన రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్వామిజీకి వివరించారు. ఆలయాలను సందర్శించి వాటి అభివృద్ధికోసం తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు, సూచనలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. శ్రీ పీఠంలో గోవుల ఆధారితంగా తయారుచేస్తున్న ఉత్పత్తులపై ముఖ్యమంత్రికి స్వామిజీ వివరించారు. గుమ్మడికాయ బుర్రలో భద్రపరిచిన బెల్లం, అగరబత్తీలను ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి దంపతులకు గోమాత జ్ఞాపికతోపాటు ఐశ్వర్యాంబికాదేవి చిత్రపటాన్ని, శేషవస్త్రాలను అందించి స్వామిజీ ఆశీర్వదించారు.

చిత్రం.. జూబ్లీహిల్స్‌లో శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని కలిసిన సిఎం కెసిఆర్ దంపతులు