తెలంగాణ

హెచ్‌సియు విసిని వెనక్కి పంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: రోహిత్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ యూనివర్సిటీ విసి అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీల్లో గొడవలు జరగడానికి పరోక్షంగా కేంద్రమే కారణమన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టడానికే వివాదస్పదమైన విసి అప్పారావును నియమించారని ఆయన ఆరోపించారు. అకారణంగా కేసులు పెట్టి జైళ్లో పెట్టిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కన్హయ్య వస్తున్నాడని తెలిసే ఆయన మీటింగ్‌ను భగ్నం చేయడానికే ఏబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థులు కుట్రపన్నారని అన్నారు. 6వేల మంది విద్యార్థుల జీవితాలు ముఖ్యమో, విసి అప్పారావు ముఖ్యమో కేంద్రం తేల్చుకోవాలన్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతుందని, ఇక్కడ అన్ని కులాలు, మతాలు సమానమేనన్నారు. అప్పారావును నియమిస్తే సెంట్రల్ యూనివర్సిటీలో దాడులు జరుగుతాయని తెలిసి కూడా కేంద్రం కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అప్పారావును ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా స్పందించాలన్నారు. తెలంగాణ రావడానికి విద్యార్థులే ప్రధానమని, అలాంటి విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.