తెలంగాణ

పెరగనున్న అడవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో అటవీ భౌగోళిక ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ అటవీ విధానాన్ని పురస్కరించుకుని భవిష్యత్ అవసరాల దృష్ట్యా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతరించి పోతున్న అడవులను పునరుజ్జీవింప చేయడంతో పాటు అటవీ సంరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రకటించిన అటవీ ప్రాంతం లోపల, బయట ప్రాంతాల్లో అడవుల పెంపకానికి వీలైన అన్ని భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం లక్ష్యంగా చేపట్టింది. మరో వైపు రాష్ట్రాన్ని హరితహారంగా తీర్చే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ హరితహారం పథకం కూడా శరవేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి జిల్లాలో జీవవైవిధ్యం, దాని పరిణామాలపై ప్రజల అవగాహన కోసం బయో డైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. జీవ వైవిధ్య చట్టం 2002 ప్రకారం అంతరించిపోతున్న జాతులను గుర్తించి ప్రత్యేక చర్యల ద్వారా సంరక్షించుకునేందుకు రాష్ట్ర జీవవైవిధ్య మండలి కృషి చేస్తుంది. 2017-18 సంవత్సరానికి గాను మండల, జిల్లా, మున్సిపల్, కార్పొరేషన్ల స్థాయిల్లో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.