తెలంగాణ

నిర్బంధాలతో పోరాటాలు ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 23: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతామని బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను కట్టబెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశానికి ముప్పు తెచ్చిపెట్టే ఈ తరహా రిజర్వేషన్లను ఉపసంహరించుకోవాలని బిజెపి యువజన విభాగం, విద్యార్ధి విభాగాల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో శాంతియుత నిరసనలు నిర్వహించామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ప్రభుత్వం బలవంతంగా అరెస్టులు చేస్తోందని విమర్శించారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచలేరని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. చివరకు ధర్నాచౌక్‌ను సైతం ఎత్తివేసి, సభలు, సమావేశాలకు అవకాశాలు ఇవ్వకపోవడం నిరంకుశ పాలనకు పరకాష్ఠ అన్నారు.
ఆస్తిపన్ను పెంపు తగదు: విహెచ్
ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పన్నులు పెంచమని హామీలు గుప్పించిన వారు పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ‘మీ నానే్నమో దానకర్ణుడు మల్లే గుళ్లకు, కులవృత్తుల వారికి దాన ధర్మాలు చేస్తాడు. నువ్వేమో ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసి నగరాన్ని అమెరికా, సింగపూర్ చేస్తానంటవ్’ అంటూ మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. అన్ని ధరలు పెంచుతారు కాని మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచమంటే మండిపడతారేంటని ప్రశ్నించారు.
కాగా, మీడియాపాయింట్ వద్ద మాట్లాడేందుకు వస్తున్న హనుమంతరావును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. మాజీ ప్రజాప్రతినిధులు మీడియాపాయింట్ వద్దకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండగా, కొత్తరూల్స్ చెబుతున్నారేంటి అని పోలీసులను ప్రశ్నించారు.