తెలంగాణ

అది కెసిఆర్ ప్రభుత్వానికి ‘ఆసరా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆసరా’ పథకం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆసరాగా మారిందని చెప్పవచ్చును. 2014 నవంబర్ 8వ తేదీన కెసిఆర్ అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం నిధుల కొరత తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అమలు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో ఈ తరహా పెన్షన్లకు సాలీనా రూ.835.62 కోట్లు కేటాయిస్తే, మూడేళ్లలో ఈ బడ్జెట్ ఏడురెట్లు పెరిగింది. ఈ పథకం కింద పెన్షన్లకు అర్హులైన వారికి ఒకటోతేదీకే నిర్దేశించిన సొమ్ము బ్యాంకుల్లో జమ కావడంతో, గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన రేఖగా మారింది. 2017-18 బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ. 5330 కోట్లను కేటాయించారు. 20115-16లో రూ.4000 కోట్లు, 2016-17లో రూ. 4693 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
వృద్ధులు, చేనేత కార్మికులు, వితంతవులు, వికలాంగ వ్యక్తులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ రోగ బాధితులు, ఒంటరి మహిళలకు ఈ స్కీం కింద పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 35 లక్షల 56వేల 315 మంది ఆసరా పెన్షన్‌దార్లు ఉన్నారు. ఇందులో నిజామాబాద్‌లో గరిష్టంగా 2,28,465 మందికి, ఆ తర్వాత జగిత్యాలలో 1,89,518 మంది, నాగర్‌కర్నూలులో 1,78,947 మంది, హైదరాబాద్‌లలో 1,64,612 మందికి పెన్షన్లు చెల్లిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత కొమరం భీం జిల్లాలో కనిష్ట స్ధాయిలో 46,339 మందికి ఆసరా పెన్షన్లు చెల్లిస్తున్నారు. మొత్తం పెన్షన్ దార్లలో 55.8శాతం మంది అంటే 19.84 లక్షల మందికి బయోమెట్రిక్ ద్వారా, బ్యాంకుల ద్వారా 44.18 శాతం మందికి అంటే 15.71 లక్ష మందికి, చెల్లింపుల ద్వారా 326 మందికి పెన్షన్ చెల్లిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్ధతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్లను ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్‌సఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి జమవుతున్నాయి. రాష్ట్రంలో ఆధార్ నంబర్ ఉన్న పెన్షన్ దారులు 99.52 శాతం మంది ఉన్నారు. అకౌంట్ లేని పెన్షన్‌దారులు కేవలం 326 మంది మాత్రమే ఉన్నారు.
పెన్షన్లు తీసుకుంటున్న వారిని విశే్లషిస్తే వృద్ధులు 13.17 లక్షల మంది, చేనేత కార్మికులు 33980 మంది, దివ్యాంగులు 4.05 లక్షల మంది, వితంతువులు 13.19లక్షల మంది, కల్లుగీత కార్మికులు57వేల మంది, బీడి కార్మికులు 3.4లక్షల మంది, ఎయిడ్స్ బ ఆధితులు 30487 మంది, ఒంటరి మహిళలు రెండు లక్షల మంది ఉన్నారు.