తెలంగాణ

డెడ్ స్టోరేజీకి సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 23: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీ (510 అడుగులు) కంటే దిగువకు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ ఇది చేదు వార్తే. జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగుల కాగా గురువారం నాటికి 509.70 అడుగులకు పడిపోయింది. ఇక ఆశలన్నీ శ్రీశైలం రిజర్వాయర్‌పైనే. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 812.20 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 796 అడుగుల వరకూ నీరు విడుదలకు అవకాశముంది. అయితే తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటిదాకా సాగర్ కుడి, ఎడమ కాల్వలకు, డెల్టా ప్రాంతానికి కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు రబీ నీటి కేటాయింపుల విడుదల సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జంటనగరాలతోపాటు జిల్లా పరిధిలోని 700 గ్రామాలకు కేవలం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచే వేసవిలో తాగునీటి సరఫరా చేయడం కష్టసాధ్యమే. ఇదిలాఉండగా తమ తాగునీటి అవసరాల కోసం సాగర్ నుండి డెల్టాకు 6.18 టిఎంసిలు నీరు రావాల్సివుందని కృష్ణాబోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తక్షణమే ఏపికి 4.89 టిఎంసిల నీటిని విడుదల చేయాలంటూ తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని బోర్డు కార్యదర్శి ఆదేశించారు. అయితే ప్రభుత్వం కృష్ణా బోర్డు ఆదేశాలకు మేరకు డెడ్ స్టోరేజీ నుండి ఏపికి నీటి విడుదల చేస్తుందో లేదోనన్న ఉత్కంఠత నెలకొంది.
రబీకి కటకట
సాగర్ ఎడమకాలువ ఆయకట్టు కింద ఆరుతడి పంటల సాగుకు నీటి విడుదల పేరిట కృష్ణాబోర్డు కేటాయింపులను అనుసరించి 31టిఎంసిల విడుదలను ఏడు విడతలుగా సాగిస్తున్నారు. వారబందీ పద్ధతిలో సాగుతున్న నీటి విడుదల క్రమంలో చివరి విడతగా ఈ నెల 25నుండి 31వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఎడమకాలువ కింద ఈ సీజన్‌లో 2.80లక్షల మేరకు వరి పంట సాగులో ఉంది. ఇందులో లక్ష ఎకరాల మేరకు సాగు ఆలస్యంగా మొదలైందని, కాబట్టి ఏప్రిల్ రెండో వారంలోగా మరో విడత నీరు విడుదల చేయాలని రైతాంగం, రాజకీయ పక్షాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. ప్రస్తుత కేటాయింపుల మేరకు చివరి విడత సాగునీటి విడుదలకు ఆటంకాలు లేకపోయినా తదుపరి డెడ్‌స్టోరేజీ దిగువ నుండి నీటిని వినియోగించుకోవాలంటే కృష్ణాబోర్డు అనుమతితో పాటు హైకోర్టు అనుమతి తప్పనిసరిగా కావాల్సి వుంటుంది.