తెలంగాణ

‘వైరల్ తెలంగాణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రం ‘వైరల్ తెలంగాణ’గా మారిందని కాంగ్రెస్ శాసనసభ్యుడు డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. శాసనసభలో వైద్య ఆరోగ్య పద్దుపై గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా డెంగీ తదితర వైరల్ జ్వరాలతో జనం బాధపడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ సోకినవారు 3160 మందికాగా, 142 మంది చనిపోయారని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడ అంతా సవ్యంగా ఉందని స్వైన్‌ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటిస్తోందని తెలిపారు. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో వైద్య రంగానికి ఏడుశాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించిందన్నారు. మొత్తం బడ్జెట్‌లో ఈ రంగానికి 10,475 కోట్లు కేటాయించాల్సి ఉండగా, 5976 కోట్ల రూపాయలే కేటాయించారన్నారు. ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరంలో వైద్య పరికరాలు, మందులు, యంత్రాలు తదితర అవసరాలకోసం 3440 కోట్ల రూపాయలు కేటాయించి, కేవలం 320 కోట్ల రూపాయలే ఖర్చు చేశారని ఆరోపించారు. దాంతో ప్రాథమిక స్థాయి నుండి బోధనాసుపత్రుల వరకు అన్నిస్థాయిలలో మందుల కొరత ఉందని, పరికరాల కొరత ఉందని, సిబ్బంది కొరత ఉందని తెలిపారు. దాంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. ఉస్మానియా, గాంధీ దవాఖానాలతో పాటు రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండటం లేదని దాంతో ఇన్‌పేషంట్లు ఇక్కట్లకు గురవుతున్నారని, ఆపరేషన్లు చేసేందుకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రాథమిక స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దవాఖానాల సంఖ్య లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పిహెచ్‌సిలను సైతం ఈ ప్రభుత్వం ప్రారంభించలేకపోయిందని విమర్శించారు. సిబ్బందిని నియమించాల్సి వస్తుందని, నిర్వహణకు నిధులు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో కొత్త్భవనాలను ఖాళీగా ఉంచారన్నారు.
కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్ విమర్శ