తెలంగాణ

‘కార్పొరేట్ విరాళాల బిల్లును వెనక్కి తీసుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలకు గేట్లెత్తుతూ దానికి చట్టబద్దత చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం దేశ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. 2017 ఆర్థిక బిల్లుకు చేపట్టనున్న సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ద్వారా విరాళాలు ఇచ్చే కార్పొరేట్ కంపెనీల పేర్లను వెల్లడించే అవసరం లేకుండా రహస్యంగా ఉంచడం వల్ల ఎన్ని కోట్లు విరాళాలు ఆయా పార్టీలకు వస్తుందీ తెలియదని అన్నారు.