తెలంగాణ

‘మార్వాడి’ వ్యాఖ్యలపై ముగిసిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: శాసనసభలో విద్యుత్‌శాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సభలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పారు. శాసనసభ గురువారం ప్రారంభం కాగానే మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సభలో తాను ప్రధాన మంత్రిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రికార్డులను కూడా పరిశీలించానన్నారు. అయినప్పటికీ తాను తప్పుగా వ్యాఖ్యలు చేసినట్టుగా బిజెపి సభ్యులు భావిస్తే సభాముఖంగా క్షమాపణలు కోరుతున్నానని మంత్రి అన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు బిజెపి సభ్యులను కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన ప్రసంగంలో మార్వాడీలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని బిజెపి పక్షం నాయకుడు కిషన్‌రెడ్డి సూచించారు. తాను ఏ కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే వాటిని ఉప సంహరించుకుంటున్నానని మంత్రి ప్రకటించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తాను 13 ఏళ్లుగా శాసనసభలో సభ్యునిగా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా స్పీకర్ వెల్‌లోకి వెళ్లలేదని, ప్రధాన మంత్రిని కించపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేయడం వల్లనే వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. వెల్‌లోకి వెళ్లినందుకు రాత్రంతా బాధపడ్డానని, అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి, బిజెపి సభ్యుడు కిషన్‌రెడ్డి ఇరువురు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ద్వారా సభ గౌరవాన్ని పెంచారని, ఇక ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని సూచించడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.