తెలంగాణ

మంచినీటి కొరత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: వేసవి వచ్చిందంటే చాలు మహానగర వాసులు తాగునీటి కోసం ఆందోళన చెందుతుంటారు. కానీ ఈసారి అలాంటి ఆందోళనేమీ అవసరం లేదని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ వేసవికాలంలోనూ మామూలు రోజుల మాదిరిగానే సాధారణంగా నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మహానగరానికి మంచినీటిని అందించే రిజర్వాయర్లలో ప్రస్తుతం పుష్కలంగా నీరుందని ఆయన వివరించారు. కృష్ణా పథకం నుంచి 270 ఎంజిడి పూర్తి డిజైన్ నీటి సేకరణలు, 172 ఎంజిడి పూర్తి డిజైన్ నీటి సేకరణలను కూడా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి గోదావరి పథకం ద్వారా సేకరించనున్నట్లు వివరించారు. గత సంవత్సరంలోని 355 ఎంజిడిల సరఫరాతో పోల్చితే ప్రస్తుతం అన్ని వనరుల నుంచి సుమారు 404 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ నుంచి కృష్ణా పథకం నుంచి అదనంగా మరో 28 ఎంజిడిలు, గోదావరి నుంచి 58 ఎంజిడిల నీటిని అదనంగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 4.74 లక్షల నీటి కనెక్షన్లకు ఏడు ఆపరేషన్, మెయింటెనెన్స్ డివిజన్ల ద్వారా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వీలైనన్ని ప్రాంతాల్లోని మురికివాడల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు రోజూ నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే శివార్లలో 4.30 లక్షల కనెక్షన్లున్నాయని, వీటికి ఏడు ఆపరేషన్, మెయింటెనెన్స్ డివిజన్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఇప్పటికే పనులు జోరుగా సాగుతున్న శివార్లలోని కొత్త ప్రాజెక్టులను వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో సరఫరా చేస్తున్నట్లు, అదనంగా నీటిని సరఫరా చేసేందుకు కృష్ణా ప్రాజెక్టు కింద పునరావాసానికి అవసరమైన ఒక ట్రాన్స్‌మిషన్ మెయిన్‌ను చేపట్టి, మార్చి చివరి నాటికి పూర్తి చేయడమవుతుందని తెలిపారు. తద్వారా కృష్ణా నుంచి అదనంగా 28 ఎంజిడిలు, గోదావరి నుంచి అదనంగా మరో 58 ఎంజిడిల నీటిని దశల వారీగా శివారు ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి వివరంచారు. దీనికి తోడు నీటి సమస్యను అధిగమించేందుకు నగరంలో చేతి పంపులు, మర పంపులు, వాల్వ్‌లు, జంక్షన్ పనులకు మరమ్మతులు చేసేందుకు, అదనంగా ట్యాంకర్ల ట్రిప్పులను సమకూర్చేందుకు రూ. 5.8 కోట్ల వ్యయంతో జలమండలి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని మంత్రి సభాముఖంగా వెల్లడించారు.