తెలంగాణ

‘ఎనీ వేర్ రిజిస్ట్రేషన్’..అవినీతిమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రిజిస్ట్రేషన్లశాఖ అవినీతికి నిలయంగా మారిందని, దీంతో రాష్ట్ర ఆదాయానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని శాసనసభలో పాలకపక్ష సభ్యుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రవేశపెట్టిన విధానం ‘ఎనీ వేర్ రిజిస్ట్రేషన్’ అవకాశాన్ని కొంత మంది అధికారులు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో ‘ఎనీ వేర్ రిజిస్ట్రేషన్’ విధానం అవినీతిపరులకు ద్వారాలు తెరిచినట్టు అయిందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో 2013లో అప్పటి ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని మొదట రంగారెడ్డి, హైదరాబాద్‌లోని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మాత్రమే కల్పించారన్నారు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న విలువైన భూములను కాజేయడం కోసమే సమైక్య ప్రభుత్వం ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ అవకాశం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో ఆధారాలతో సహా బయట పెట్టాక అప్పటి ప్రభుత్వం దీనిని 23 జిల్లాలకు వర్తింప చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానం దుర్వినియోగం అవుతోందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
గచ్చిబౌలిలో మొబైల్ సొసైటీ పేరుపై రెండున్నర ఎకరాలకు గాను 84 ఎకరాలుగా అప్పట్లో గుంటూరులో రిజిస్ట్రేషన్ చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీబీనగర్‌లో ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేసిన భూమిని ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారన్నారు. సదరు భూమి ఇతరులదని తెలిసినప్పటికీ కొందరు అవినీతి అధికారులను లోబర్చుకొని అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిపరులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో చార్మినార్, గోల్కొండ కట్టడాలను కూడా రిజిస్ట్రేషన్ చేసినా ఆశ్చర్యం లేదని శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. పాలకపక్ష సభ్యుని ఆరోపణలపై రెవిన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ గచ్చిబౌలి, బీబీనగర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణకు ఆదేశించామన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానం ఉద్దేశం మంచిదేనని, అయితే ఎక్కడైనా దీనిని దుర్వినియోగం చేస్తే చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ అంటే జిల్లా పరిధిలోని ఆస్తులు అదే జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కొన్ని కార్యాలయాలలో ఎక్కువ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే దాని అర్థం అక్కడ అవినీతి జరుగుతున్నట్టు కాదని, అక్కడి అధికారులు స్నేహశీలంగా వ్యవహరించడం కూడా కారణం అయి ఉంటుందని మంత్రి సమర్థించారు.