తెలంగాణ

రెండు వేల పంచాయతీలకు కొత్త భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్టవ్య్రాప్తంగా ఈ ఏడాది 2 వేల గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో బిజెపి సభ్యులు జి కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు జూపల్లి సమాధానం చెబుతూ, కొత్తగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 13 లక్షలు కేటాయించామన్నారు. పంచాయతీ భవనాలతో పాటు ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామం (శ్మశాన వాటికలు) నిర్మించనున్నట్టు మంత్రి చెప్పారు. గ్రామాలలో వౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా కోసం నిధులు లేక గ్రామ పంచాయతీలు చతికిలబడ్డాయన్న విమర్శలలో వాస్తవం లేదని మంత్రి ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేయాల్సిన గ్రాంట్లలో జాప్యమే గ్రామ పంచాయతీలలో నిధుల కొరతకు కారణమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని మంత్రి వివరించారు. కేంద్రం 13, 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీరాజ్‌శాఖకు రూ.4265 కోట్లు కేటాయించి రూ.3610 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే పట్టణాభివృద్ధిశాఖకు రూ.1720 కోట్లు కేటాయించి రూ.1117 కోట్లు విడుదల చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖకు రూ.1074 కోట్లు కేటాయించి అందులో రూ.551 కోట్లు విడుదల చేయగా, పట్టణాభివృద్ధికి రూ.2121 కోట్లు కేటాయించి రూ.1176 కోట్లు విడుదల చేసిందని మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద రాష్ట్రానికి రూ.2925 కోట్ల కేటాయించి ఇప్పటి వరకు రూ.2167 కోట్లు విడుదల చేసిందన్నారు. అంతకుముందు సభలో బిజెపి సభ్యులు జి కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బదలాయించడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిస్థితి నీళ్లు లేని బావులుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని వారు దుయ్యబట్టారు. ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపును పర్యవేక్షించే వ్యవస్థ లేకుండా పోయిందని వారన్నారు.