తెలంగాణ

కార్మిక శాఖలో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణలో కార్మిక శాఖ అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నార్సింహరెడ్డి తెలిపారు. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో అధికారులు ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు గానూ సెల్ఫ్ సర్ట్ఫికేషన్ విధానం పద్దతిని పెట్టనున్నామన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ట్రాన్స్‌పోర్టు, హోంగార్డుల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా దాదాపు 13 లక్షల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. రాష్ట్రంలో 2009 తరువాత కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేయలేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత కనీస వేతనాలు చెల్లించే విధంగా వేజ్ బోర్డును ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. బాల కార్మికుల కోసం ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి 31 జిల్లాలో బాలకార్మికులను రక్షించడం జరుగుతుందని, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కార్మిక సంక్షేమ మండలిలో 9,87,489 మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు భవన నిర్మాణ రంగ కార్మికులకు వివిధ పథకాల కింద రూ. 24,64,62,854లు పంపిణీ చేశామని, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా మెరుగుపరచి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌లో భాగంగా ఆన్‌లైన్ ద్వారా 768 ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, 294 కొత్త ప్రాంతాలకు ఇఎస్‌ఐ సేవలు విస్తరించి లక్షా 13వేల మందికి కొత్తగా లబ్ధిదారులుగా చేర్చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఇఎస్‌ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజిని సనత్‌నగర్‌లో ప్రారంభించడం జరిగిందని, ఇందులో 50శాతం సీట్లు తెలంగాణలోని బీమా కలిగిన పేషంట్ల కుటుంబాల పిల్లలకు రిజర్వు చేయబడ్డాయని మంత్రి నాయిని వివరించారు.