తెలంగాణ

బ్రాహ్మణ నిరుద్యోగులకోసం 26 న జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: జిహెచ్‌ఎంసి (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధితో పాటు చుట్టుపక్కల నివసిస్తున్న బ్రాహ్మణ నిరుద్యోగులకోసం ఈ నెల 26 న ‘జాబ్‌మేళా-2017’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నేతృత్వంలో ‘పైలట్ ప్రాజెక్టు’గా ఈ కార్యక్రమం చేపడుతున్నామని పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రమణాచారితో పాటు పరిషత్ వైస్-చైర్మన్ వనం జ్వాలానర్సింహారావు, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్న వేణుగోపాలాచారి, సభ్యురాలు సులోచనా సువర్ణ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బుధవారం జరిగిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జాబ్‌మేళా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హైదరాబాద్ (యూసుఫ్‌గుడా) లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిమ్స్‌మే) ఆవరణలో 26 న ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. నిమ్స్‌మేతో పాటు సెట్విన్ కూడా జాబ్‌మేళాకు సహకారం అందిస్తున్నాయన్నారు. సుమారు 40 కంపెనీల అధికారులు తమ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు వస్తున్నాయన్నారు. జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ద్వారా (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జాబ్‌మేళా.ఆన్‌లైన్/టిబిఎఎస్‌పి/రిజిస్ట్రేషన్) తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేని వారు నేరుగా రావచ్చని తెలిపారు. పదోతరగతి నుండి ఆపైఉన్నత తరగతులు చదువుకున్న అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, అభ్యర్థులు తమ వెంట విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్/జిరాక్స్ కాపీలను తీసుకురావాలని వారు సూచించారు. అభ్యర్థుల నుండి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదని, వయోఃపరిమితి కూడా ఏమీ లేదన్నారు. అయితే సాధారణంగా యువతకు ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు. బ్రాహ్మణ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకోసమే ఎదురుచూడకుండా ప్రైవేట్ ఉద్యోగాలు లభించినా చేరాలని సూచించారు. పెరిగిపోతున్న జనాభా కారణంగా ప్రభుత్వం ఎన్నిపథకాలు చేపట్టినా నిరుద్యోగ సమస్య తీరదన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే జాబ్‌మేళా విజయవంతం అయితే జిల్లాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇలా ఉండగా, రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, ఎంత మంది బ్రాహ్మణులు ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే చేయాలని భావిస్తున్నట్టు రమణాచారి తదితరులు తెలిపారు. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో ‘రాష్ట్ర బ్రాహ్మణ సదనా’నికి ఆరుఎకరాల భూమిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేటాయించారని గుర్తు చేశారు. ఈ భూమిని ఇప్పటికే తమ పరిషత్ స్వాధీనం చేసుకున్నదన్నారు. ఈ సదనానికి 2017 ఏప్రిల్‌లో కెసిఆర్ చేతుల మీదుగా భూమిపూజ జరుగుతుందన్నారు. జిల్లాల్లో కూడా భవనాలు నిర్మిస్తామని, ఒక ఎకరం భూమి సేకరిస్తే, భవన నిర్మాణానికి 75 శాతం నిధులను సంక్షేమ పరిషత్ కేటాయిస్తుందన్నారు. కళ్యాణమండపంగా, ప్రవచన కేంద్రంగా, స్టడీసర్కిల్‌గా వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను 2017 ఫిబ్రవరిలోనే సొసైటీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేశామని వారు తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వం 2016-17లో కేటాయించిన 100 కోట్ల రూపాయలు ల్యాప్స్ కావడం లేదన్నారు. ఈ నిధులతో పాటు 2017-18 సంవత్సరానికి కేటాయించిన 100 కోట్ల రూపాయలతో కలిపి 200 కోట్లను విద్య, వైద్య అవసరాలతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలకోసం వినియోగిస్తామన్నారు.

చిత్రం..మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న కెవి రమణాచారి