తెలంగాణ

గురుకులాల బోధనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: ప్రభుత్వ గురుకుల కళాశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని ప్రారంభంలోనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో గురువారం మంత్రి సమ్మర్ సమురాయ్‌ని ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ, గురుకుల సంక్షేమ, గురుకుల విద్యా బోధన మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం కుదిరిందని అన్నారు. ఐదవ తరగతి లో రాష్ట్ర వ్యాప్తంగా 40వేల సీట్లు ఉండగా, ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఒక లక్ష, 20వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ప్రజల జీవణ ప్రమాణాలు పెంచేందుకు విద్య ప్రధాన కారణమనే భావనతో విద్యా రంగానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్న ప్రధాన్యతే దీనికి కారణమని అన్నారు. మహిళా కళాశాలలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే యూనివర్శిటీలు నిర్వహించిన మొదటి సెమిస్టర్‌లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన ఘనత గురుకుల విద్యా సంస్థలకే దక్కిందని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దళిత, గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రవీణ్‌కుమార్ లాంటి అధికారుల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలతో పాటు గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యయనం చేసిన తరువాత సమురాయ్ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. మొదటి సంవత్సరం 15వేల మంది పాల్గొంటే ఆ సంఖ్య ఈ సంవత్సరానికి రెట్టింపు అయి 30వేలకు చేరుకుందని అన్నారు. ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల్లో సమ్మర్ సమురాయ్ ద్వారా సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వారి తల్లి తండ్రులలో ప్రభుత్వం మీద విశ్వాసం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.