తెలంగాణ

బిజెపి సభ్యుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఐదుగురు బిజెపి శాసన సభ్యులను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. బిజెపి సభ్యులు నల్ల కండువాలు ధరించి సభలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. బిజెపి సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఆందోళన చేస్తున్న సభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించకుండా సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని, ఈ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి వెల్లడించారు. ఆ సమయంలో జానారెడ్డితోపాటు సభలో ఉన్న నలుగురు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
ఉదయం శాసన సభ ప్రారంభం కాగానే ముస్లిం రిజర్వేషన్లను నిరసిస్తూ బిజెపి సభ్యులు నల్లకండువాలు ధరించి, సభలో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బిజెపి సభ్యులు పథకం ప్రకారమే ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. సబ్ ప్లాన్ లేనందున ఎస్సీ బిల్లు ఈ రోజు పెడతామంటే బిజెపి సభ్యులు మరో రోజు పెట్టాలని కోరారని, ఈరోజు సభలో సస్పెండ్ కావాలని వాళ్లు ముందే నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. స్పీకర్ అనుమతితో బిజెపి సభ్యులు ఐదుగురిని ఈ వారం చివరిదాకా (శుక్ర, శని) సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ తీర్మానం ఆమోదించిన తరువాత ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోవడం మంచిది కాదన్నారు. ‘బిజెపి వాళ్లను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.
ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ను తొలగించక పోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ధర్నా చౌక్‌లో బిజెపి వాళ్లు మొత్తుకొని వెళ్లిపోయే వాళ్లు’ అన్నారు. కాగా పక్క రాష్ట్రంలో నాలుగు గంటలు కూడా సభను నడపడం లేదని, ఇక్కడ అధికార పక్షం కన్నా విపక్షానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చివరకు కిషన్‌రెడ్డి, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌లను ఈ వారం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటన తరువాత కూడా బిజెపి సభ్యులు బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తూనే ఉండటంతో మార్షల్స్‌ను పిలిపించి వారిని బయటకు పంపించారు.

చిత్రం..శుక్రవారం అసెంబ్లీనుంచి సస్పెండ్ అయన అనంతరం మీడియాపాయంట్ వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి ఎమ్మెల్యేలు