తెలంగాణ

జిల్లాకో మెడికల్ కాలేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఆస్పత్రుల ఏర్పాటు గురించి మంత్రి వివరణ ఇచ్చారు.
నల్లగొండలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించగా, నల్లగొండ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆస్పత్రి సామర్ధ్యం పెంచనున్నట్టు, అదేవిధంగా పిజి డిప్లొమా కోర్సులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోందని, నల్లగొండ జిల్లాలో సైతం వైద్య కళాశాల ఏర్పాటు పరిశీలనలో ఉందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ నాలుగు ఆస్పత్రులను నిర్మించనున్నట్టు చెప్పారు. ఐదు వందల పడకలు, 250 పడకల ఎంసిహెచ్ మొత్తం 750 పడకల ఆస్పత్రులు నాలుగు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎల్‌బి నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ వద్ద, రాజేంద్ర నగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టెర్మినల్ పక్కన మొత్తం నాలుగు ఆస్పత్రులను నిర్మించనున్నట్టు చెప్పారు.
తొలుత ఈ నాలుగు ప్రాంతాలను పరిశీలించినట్టు, ఇతర ప్రాంతాలు కూడా చూస్తామని చెప్పారు. వీటికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు రూపొందించినట్టు తెలిపారు. 27కోట్ల వ్యయంతో నల్లగొండ ఆస్పత్రిని ఆధునీకరించినట్టు చెప్పారు. నల్లగొండ ఆస్పత్రిని టీచింగ్ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.