తెలంగాణ

రజాకార్లను తలపిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో బిజెపి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులతో అణచివేయడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన బిజెపి కేంద్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రజాకార్ల రాజ్యం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మతపరమైన రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తోందని, భవిష్యత్తులో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలను తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ అంతరించుకుపోయిందని, అలాంటి పంథానే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన చెప్పారు.