తెలంగాణ

మళ్లీ.. విజయం మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నెల 21న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్వహించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమైన సిఎం కెసిఆర్, ప్లీనరీ ఎప్పుడు నిర్వహించేదీ ఖరారు చేశారు. సభా ప్రాంగణంలో శ్రమదానం చేసి విరాళాలతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ప్లీనరీ కోసం జరిపే శ్రమదానంలో తాను సైతం పలు పంచుకుంటానని ప్రకటించారు. ‘నేనూ శ్రమదానం చేస్తా. విరాళాల సేకరిస్తా’నని పార్టీ నేతలకు సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సిఎం కెసిఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తెరాసనే గెలిపించి, అధికారం అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ వచ్చే ఎన్నికల్లో తెరాస అఖండ విజయం సాధించటం ఖాయమని సూచిస్తున్నాయని సిఎం స్పష్టం చేశారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా, వారికి అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పని చేయాలని సూచించారు.
సంస్థాగత ఎన్నికల షెడ్యూల్
తెరాస సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లోని కొంపల్లిలో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఏప్రిల్ 6న గ్రామ కమిటీల ఎన్నికలు, 12, 13 తేదీల్లో మండల కమిటీల ఎన్నికలు, 14న రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 18న నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల ఉప సంహరణ, 21న ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. 27న వరంగల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో బహిరంగ సభ జరుగుతుంది.
ప్లీనరీ అతిథులు
21న జరిగే ప్లీనరీకి ఎవరెవరిని ఆహ్వానించాలని సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌లు, మార్కెటింగ్ సహకార సంఘాల చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నగర పాలక సంస్థల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్‌లు, ఎంపిపిలు, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఆత్మా కమిటీ సభ్యులను ఆహ్వానించాలని సమావేశం నిర్ణయించింది.
ఇన్‌చార్జిల నియామకం
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి నిర్వహించే ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి నియమితులయ్యారు. గ్రామ శాఖ ఎన్నికలకు కూడా రిటర్నింగ్ అధికారులను నియమిస్తారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నికలు, బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణకు రాష్టస్థ్రాయిలో సీనియర్ నేతలు పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. జిల్లాలకు ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వేణుగోపాలచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్ ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు.
శ్రమదానంతో విరాళాల సేకరిస్తారు. పార్టీ నేతలంతా తమ నియోజక వర్గాల్లో శ్రమదానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలా వచ్చిన డబ్బును పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లకు, జన సమీకరణకు ఉపయోగించాలని నిర్ణయించారు.

చిత్రం... ప్లీనరీ పోస్టర్ విడుదల చేస్తున్న సిఎం కెసిఆర్