తెలంగాణ

ఆన్‌లైన్‌లోనే వాహన కాలుష్య ధ్రువీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వాహన కాలుష్య ధృవీకరణ మధ్యవర్తులతో పనిలేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో గువ్వల బాలరాజు, అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, చిన్నయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జాఫర్ హుస్సేన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. రవాణాశా ఖ ప్రస్తుతం ధృవీకరణ ఏజన్సీలు ద్వారా అందిస్తున్న కాలుష్య ధృవీకరణ పత్రాలను అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రైవేటు వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా ఆన్‌లైన్‌లో అందించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అలాగే ప్రస్తుతం వాహన సామర్ధ్యం ధృవీకరణ విద్యావంతులతో వ్యవస్థీకృతమైన రవాణాశాఖ అధికారులకే అప్పగించే అంశం మీద త్వరలో చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్లు భద్రత, ప్రమాదాల నివారణకు ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మితిమీరిన వేగంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నందున ప్రమాదాల నివారణకు స్పీడ్ గవర్నర్‌లను చెక్ పోస్టులు సహా జాతీయ, ఇతర రహదారులలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేగ నియంత్రణతో పా టు స్టేజి కాంట్రాక్టు క్యారేజీల నివారణకు సిబ్బంది తనిఖీలు పెంచుతున్నామని ఇలా సుమారు 23 వేల కేసులు నమోదు చేశామని అన్నారు. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనదారులు అం తా స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని రవాణా శాఖ కు స్వంత భవనాలు, వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు పేర్కొంటూ ఆన్‌లైన్ సేవలకు తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నా రు. తెలంగాణలో ఎం వ్యాలెట్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా సుమారు 25 లక్షల మందికి నెట్ ద్వారా సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉందని అన్నా రు. రాష్ట్రంలో 2008 ఆగస్టు మాసం లో నామమాత్రంగా ప్రారంభమైన ఆన్‌లైన్ సేవలను 57 సేవలకు విస్తరించామని అన్నారు. 6.41 లక్షల లెర్నిం గ్ లైసెన్స్‌లు, 6.13 లక్షల డ్రైవింగ్ లైసెన్స్‌లు, 10.59 లక్షల రిజిస్ట్రేషన్‌లు, 2.48 లక్షల ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్లు, లక్షా 70వేల పర్మిట్‌లను అందించామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లోనే కాకుండా మిగిలిన పట్టణాల్లో కూడా ఎం వ్యాలెట్ విస్తరించే చర్యలు తీసుకుంటామని అన్నారు. బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయానికి 33 లక్షల నిధులు అందించామని, అవసరమైన మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
పంచాయితీలకు సొంత భవనాలు
రాష్ట్రంలో అన్ని పంచాయితీలకు సొంత భవనాలను మంజూరు చేసిందని పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శంకర్‌నాయక్, సునీత, మదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాలకిషన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ 2315 గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేశామని, 301 కోట్ల రూపాయిల మొత్తాన్ని మంజూరు చేశామని, అందులో ఇంత వరకూ 33.47 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230 హాస్టల్ వార్డెన్ పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని బిసి సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న చెప్పారు. ఉన్నతస్థాయి కళాశాలల్లో పనిచేసే వార్డెన్ల స్థాయిని పెంచుతామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు.