ఆంధ్రప్రదేశ్‌

పనులు లేక జనం వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ పథక నిధులను ఉపాధి సృష్టించేందుకు వాడకపోవటంతో ఇక్కడ ఉపాధి లభించక లక్షలాది మంది కూలీలు కేరళ, కర్నాటక, చెన్నై రాష్ట్రాలకు వలస పోతున్నారంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం శాసనసభలో నిప్పులు చెరిగారు. స్వప్రయోజనాలు, లాభాల కోసం ఉపాధి హామీ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల వ్యయాన్ని తగ్గించి మెటీరియల్ కాంపోనెంట్‌ను పెంచుకుంటూ పోతుండటం వలన పనులు లేక వలసవెళుతున్న జనం ఇతర రాష్ట్రాల్లో భిక్షాటన చేసుకుంటున్నారంటూ పలు వార్తాకథనాల కాపీలను ప్రదర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 97.5 శాతం ఉపాధి హామీ నిధులను లేబర్ కాంపోనెంట్‌కి వినియోగించారన్నారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి ఈ పథకం కింద గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతుండటం నచ్చటం లేదంటూ జగన్‌పై ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్వివాదం నెలకొంది. తొలుత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కొద్దిసేపు సభను వాయిదా వేయగా దీనిపై చర్చకు అవకాశం కల్పించలేదంటూ వైకాపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసారు. సభ్యులు కదిరి బాబూరావు, దామచర్ల జనార్ధనరావు, జివి ఆంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి అయ్యన్నపాత్రుడు సమాధానమిస్తూ 2016-17లో 63 లక్షల 93వేల 689 మందికి వేతన ఉపాధి కల్పించామన్నారు. 5లక్షల 17వేల 294 కుటుంబాలవారు 100 రోజుల వేతన ఉపాధిని పూర్తిచేశారన్నారు. 19కోట్ల 54లక్షల 99వేల పనిదినాలను కల్పించామన్నారు. 2016-17లో 38 లక్షల 86వేల 049 కుటుంబాలకు చెందిన 63లక్షల 93వేల 689 మంది కూలీలకు 19కోట్ల 55లక్షల పనిదినాలు కల్పించి రూ.498 కోట్ల 57లక్షల 67వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 2014-15లో 296కోట్ల 66లక్షలు, 2015-16లో 440కోట్ల 81లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ నిధులతో గ్రామాలకు శాశ్వతంగా ఉండేలా వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, భూగర్భ డ్రైనేజి, ఐదు లక్షల వ్యయంతో అంగన్‌వాడీ భవనాలు, రూ.17 లక్షలతో పంచాయతీ భవనాలు, చివరికి ఎవరైనా అంతిమంగా చేరుకునే చివరి ప్రస్థానం శ్మశానం అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే ఇప్పటికి 150 శ్మశానాలను అభివృద్ధి చేశామన్నారు. ఇందువల్ల ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఉత్తమ అవార్డు లభించిందన్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ నుంచి ప్రశంసలు లభించాయన్నారు. అయితే వైకాపా ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి ఈ పథకం కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారంటూ కేంద్రానికి లేఖ రాసారంటూ ఆ లేఖ ప్రతిని సభలో ప్రదర్శించగా అధికారపక్ష సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినదించారు. దీనిపై జగన్ అడ్డుతగులుతూ చట్టప్రకారం 60 శాతం నిధులను లేబర్ కాంపోనెంట్‌కే వినియోగించాలన్నారు. అయితే ఈ నిధులతోనే ఇతరత్రా పనులకు అదీ అత్యధిక మొత్తాలను ఖర్చు చేస్తుండటం వలన కార్మికులకు ఉపాధి లేకుండా పోతున్నదన్నారు. అయితే మెటీరియల్ కాంపోనెంట్‌ను ఎక్కువ పెట్టడం వల్ల అవార్డులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది కానీ, పేదల గురించి పట్టించుకోటం లేదన్నారు. వలస వెళ్లిన కూలీలు ఆయా రాష్ట్రాల్లో మురికి కాలువలు, బస్‌స్టేషన్లలో గడుపుతుంటే కేరళ ప్రభుత్వం చూడలేక 25 కిలోల బియ్యం అందచేస్తుంటే అక్కడ సంతోషంగా ఉన్నారంటూ చెప్పటం దారుణమన్నారు. దీనిపై మంత్రి అయ్యన్నపాత్రుడు కాలుగచేసుకుంటూ గతంలో రోజువారీ కూలీ రూ.150లు ఉంటే ప్రస్తుతం రూ.194లు ఇస్తున్నామన్నారు. ఇంతకంటే ఎక్కువ కూలి సొమ్ము వస్తున్నందునే జనం వలస వెళుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం నిధులు ఖర్చు చేయక ఐదువేల కోట్లను వెనక్కి పంపించారనగా అధికారపక్ష సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినదించారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో ఉపాధి కల్పిస్తామంటూ మంత్రి సవాల్ విసిరారు. వైకాపా సభ్యులు విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ పనులు లేక ఒక్క అనంతపురం నుంచే దాదాపు మూడు లక్షలమంది వలస వెళ్లారని అన్నారు. స్థానికంగా కూలీల అభిప్రాయాలు తెలుసుకోకుండా వారు చేయలేని పనులు చేపడుతున్నందునే ఉపాధి లేక వలసలు వెళుతున్నారని అన్నారు. ఓ దశలో స్పీకర్ డాక్టర్ కోడెల కల్పించుకుంటూ తాను ఎవరినీ సమర్థించడం లేదన్నారు.