ఆంధ్రప్రదేశ్‌

‘సాంస్కృతిక’ కార్యాలయం ఇంకెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (జగదాంబ) మార్చి 25: ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సాంస్కృతిక సంబంధాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఎడతెగని జాప్యం చేసిందని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ గతంలో ఏపీకి ఈ కార్యాలయాన్ని మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలికి గత ఏడాది ఆగస్టు 2న లేఖ రాసామన్నారు. దీనిపై ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామంటూ తమకు సమాధానం వచ్చిందన్నారు.
అయితే ఏడు మాసాలు గడిచినా ఇప్పటికీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నోడల్ అధికారిని నియమించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇటువంటి కార్యాలయాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కొత్త కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రానికి జాతీయ నాటక పాఠశాల, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ ద్వారా నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న పలు సాంస్కృతిక కళాకారులను ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తప్పెటగుళ్ళు, కోలాటం తదితర కార్యక్రమాలు తెలుస్తాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సాంస్కృతిక శాఖకు బడ్జెట్ తగ్గించడం అన్యాయమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతాయని హెచ్చరించారు.

చిత్రం,,, విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్