ఆంధ్రప్రదేశ్‌

దద్దరిల్లిన శాసనసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఫీజు రీయింబర్స్‌మెంట్, బిసి, ఎస్‌సి, ఎస్‌టి స్కాలర్‌షిప్ బకాయిలపై వైకాపా సభ్యులు రెండుమార్లు వాకౌట్.. స్పీకర్ పోడియం వద్ద 40 నిమిషాలు పైగా నినాదాల హోరు, ఒకసారి వాయిదా.. తదితర గందరగోళ పరిస్థితులతో శాసనసభ శుక్రవారం ప్రారంభంలోనే దద్దరిల్లింది. అయితే వరుసగా రెండురోజులు ప్రశ్నోత్తరాలు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈదఫా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టుదలతో తొలుత 20 నిమిషాలపాటు సభను వాయిదా వేసినప్పటికీ ఆపై విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను మధ్యాహ్నం 12 గంటలకల్లా ముగించారు. వైకాపా సభ్యుల ప్రమేయం లేకుండానే ఐదు ప్రశ్నలు సాఫీగా సాగాయి. ప్రధానంగా వైకాపా సభ్యులు పినె్నల్లి రామకృష్ణారెడ్డి అడిగిన మాచర్లలో మంచినీటి ఎద్దడి ప్రశ్న కూడా ఎలాంటి చర్చ లేకుండానే దాటిపోయింది.
ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల ప్రారంభంలో తొలిగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చర్చను ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి లేచి ఈ పథకం అమల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుంది.. లక్షలాది మంది కూలీలు ఇక్కడ పనులు లేక వలసపోతున్నారంటూ నిప్పులు చెరిగారు. అయితే ఆయన మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనే మైక్ కట్ కావటంతో ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ కోడెల సభను వాయిదా వేసారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా వైకాపా సభ్యులు ఆందోళనను కొనసాగించారు. మంత్రి సమాధానంతో ఏ మాత్రం సంతృప్తి చెందని వైకాపా ఆ ప్రశ్న వరకు సభ నుంచి వాకౌట్ చేసింది.
ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మరో ప్రశ్న రూపంలో చర్చకు వచ్చినప్పుడు కూడా వైకాపా సభ్యులు మరోమారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు నిలబడి నినాదాలు చేసారు.

పోడియంను చుట్టుముట్టిన వైసిపి ఎమ్మెల్యేలు