ఆంధ్రప్రదేశ్‌

త్వరలో అకాడమీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: తెలుగు సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం త్వరలోనే సాహితి, సాంస్కృతిక, నాటక, చారిత్ర, నృత్య అకాడమీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల్లో అధికార పక్ష సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. 2016-17లో 6200 మంది పింఛన్‌దారులకు రూ.1500ల చొప్పున అందచేస్తున్నామన్నారు. 2014-15 వరకు రూ.500లు మాత్రమే వచ్చేదన్నారు. మోదుగుల మాట్లాడుతూ కేంద్రం అందించే రూ.3500 పెన్షన్ రాష్ట్రంలో ఎంతమందికి వస్తున్నదనే ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. ఆర్‌టిసి బస్సుల్లో కళాకారులకు రాయితీ కల్పించాలన్నారు. బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కళాకారులకు పెన్షన్లు మూడు, నాలుగు నెలలకోసారి వస్తున్నాయంటూ వృద్ధులు, వితంతు పెన్షన్ల తరహాలో కచ్చితంగా ప్రతినెలా వచ్చేలా చూడాలన్నారు.
అమృత్ పథకం కింద
32 పట్టణాలు ఎంపిక: మంత్రి నారాయణ
అమృత్ పథకం కింద రాష్ట్రంలో 32 పట్టణాలు ఎంపికయ్యాయని సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, శ్రీరాం రాజగోపాల్, వేగుళ్ల జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణ చెప్పారు. ఈ పథకం కింద అవసరమైన నీటి సరఫరా వ్యవస్థను సమకూర్చి హౌస్ సర్వీస్ కనెక్షన్లు ఇవ్వటం, వరదనీటి పారుదల సౌకర్యం కల్పిస్తామన్నారు.
సాంఘిక సంక్షేమశాఖకు
పెద్దపీట: మంత్రి రావెల
సాంఘిక సంక్షేమశాఖకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు కె.శ్రీనివాసులు, కె.సంజీవయ్య, కె.జోగులు, ఎం.సునీల్‌కుమార్, కె.నారాయణస్వామి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3వేల 236 కోట్లు కేటాయించి 2వేల 688కోట్ల 69లక్షలు విడుదల చేశామన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రఘునాథరెడ్డి