తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణలో ఈసారి అధికారం తమదేనని, వచ్చే సార్వత్రిక ఎన్నికల సంర్భంగా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు తమ బ్రహ్మాస్త్రం ప్రధాని నరేంద్రమోదీయేనని ఆయన చెప్పారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచి బూత్‌ల వారీగా సమీక్షలు జరుపుతున్నామని, తెరాస సర్కారు వైఫల్యాలే తమను అధికారంలోకి తెస్తాయని తెలిపారు. నరేంద్ర మోదీ చేపట్టిన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని, వాటిని ప్రజలు హర్షిస్తున్నారని, తెలంగాణలో సైతం మోదీ ప్రభంజనం వీస్తోందని లక్ష్మణ్ చెప్పారు. కెసిఆర్ సర్కారు ఎన్నో తప్పిదాలకు పాల్పడుతోందని, అవే బిజెపికి అనుకూల అంశాలు అవుతాయని, తమ పార్టీకి ప్రజలే బాహుబలులని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ, సంక్షేమ రంగాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయమై తెరాస సర్కారు చెప్పింది ఎక్కువగానూ, చేసింది తక్కువగానూ ఉందన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌లో మూడింట ఒక వంతు నిధులు కేంద్రం ఇచ్చినవేనని తెలిపారు.
తెలంగాణలో మండలస్థాయి వరకూ కమిటీలను వేసి, ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. ఎన్నికలే లక్ష్యంగా కాకుండా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేగాక, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు.
నేడు సింగరేణి ప్రాంతీయ సభ
సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26న గోదావరిఖనిలో ప్రాంతీయ సభ నిర్వహిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. ఓపెన్‌కాస్టులను తగ్గించి భూగర్భ గనులను పెంచాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.