తెలంగాణ

ఎస్సీ కమిషన్ ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ ఉద్యమ సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను అధికారం వచ్చిన తర్వాత కెసిఆర్ తుంగలో తొక్కారని టిటిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మేడిపల్లి సత్యం విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంకా ఎస్సీ కమిషన్ నియమించకపోవడం, తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని, లేదంటే తలనరుక్కుంటానని చెప్పిన కెసిఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కెసిఆర్ దళిత వ్యతిరేకి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు సరికదా, ఉపముఖ్యమంత్రి తలతీశారని ఆయన ఎద్దేవా చేశారు. మరో వైపు దళిత శాఖను అగ్రవర్గానికి కేటాయించి దళితులను అవమానించారు. దళితులకు కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. టిఆర్‌ఎస్‌లో ఉన్న దళిత నేతలు కెసిఆర్‌కు భజన చేయకుండా దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.