తెలంగాణ

పోలీసులకు సైకాలజిస్టుల సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మానసిక సమస్యలు పరిష్కరించేందుకు, క్లిష్టపరిస్ధితుల్లో సంక్షోభాలను ఎదుర్కొనే విషయమై క్లినికల్ సైకాలజిస్టుల సహాయం తీసుకునే ఒక ప్రాజెక్టును అమలు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. గత రెండేళ్లలో దాదాపు ఏడుగురు పోలీసు అధికారులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కేంద్ర బలగాలకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటిన్ బోర్డర్ ఫోర్స్, సిఆర్‌పిఎఫ్ బలగాల్లో చాలామంది ఒక్కోసారి అల్పమైన కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు విదితమే. వీరికి కౌనె్సలింగ్ ఇచ్చేందుకు కేంద్ర బలగాల విభాగం క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని తీసుకుని అమలు చేస్తోంది. దీని వల్ల సత్ఫలితాలు వచ్చాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాలమేరకు తెలంగాణ పోలీసు శాఖ కూడా పోలీసులకు మనోధైర్యం ఇచ్చేందుకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతోంది. డిఎస్పీ స్ధాయి నుంచి కానిస్టేబుల్ వరకు సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే క్లినికల్ సైకాలజిస్టులకు ఫోన్ చేయడం లేదా వారి వద్దకు వెళ్లి సమస్యలు చర్చించే విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ పోలీసు అకాడమి రూపొందిస్తోంది.