తెలంగాణ

పాత్రికేయులకు పండితారాధ్యుల ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, మార్చి 26: ప్రముఖ పాత్రికేయులు పండితారాధ్యుల నాగేశ్వరరావు రచనలు నేటితరం పాత్రికేయులకు ఆదర్శనీయమని తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమి చైర్మన్‌లు అల్లం నారాయణ, వాసుదేవ దీక్షితులు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో పండితారాధ్యుల నాగేశ్వరరావు 105వ జయంతిని పురస్కరించుకొని ‘పండితారాధ్యుల నాగేశ్వర రావు సంపాదకీయాలు’ పేరిట ప్రచురించిన పుస్తకాన్ని వారు ముఖ్యఅతిధులుగా హాజరై ఆవిష్కరించారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు వరదాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి నాగేశ్వరరావు రచనలు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఒకప్పుడు సంపాదకీయాలు వాస్తవ పరిస్థితులను ప్రతిభింబించే విధంగా ఉండేవని, సంపాదకులు ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా రచనలు చేసే వారని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, యాజమాన్యాల ఆలోచన విధానాలకు అనుగుణంగా రచనలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎంతో మంది ఉత్తమ పాత్రికేయులను సమాజానికి అందించిన ఘనత నాగేశ్వరరావుకు దక్కుతుందని కొనియాడారు. వయోధిక పాత్రికేయ సంఘం సభ్యులు.. నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.