తెలంగాణ

మీ సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీకి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల ప్రతినిధి బృందం ఆదివారం మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు, బోనస్, కార్మిక చట్టాల అమలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. కోల్ ఇండియా వేతనాలు, బోనస్ తదితర కార్మిక చట్టాలను అమలు చేయని ఫలితంగా సింగరేణి కార్మికులు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని యూనియన్ల నేతలు మంత్రికి వివరించారు. ఈ అంశాలను బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతానని, బోనస్ అమలు అంశంపై తగు ఆదేశాలు జారీ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రవిశంకర్, ఐఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు టి.నర్సింహన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, పలు కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.