తెలంగాణ

సిసి రోడ్లకు అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: నియోజకవర్గ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి కలెక్టర్ తక్షణమే అనుమతి మంజూరు చేయాలని లేదంటే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం జివో నెం.1000ని తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం సిసి రోడ్ల నిర్మాణానికి 126 పనులకు అనుమతులు కోరినా ఇంకా మంజూరు చేయలేదని, అదే టిఆర్‌ఎస్ నాయకులు కలెక్టర్ ద్వారా వెళ్లకపోయినా 150 పనులకు అనుమతులు వచ్చాయని అన్నారు. ఈ నెలాఖరులోగా తమకు అనుమతి ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని కెసిఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకే వంద సీట్లు రావడం ఖాయమని వంశీచంద్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.