తెలంగాణ

విజయవంతమైన జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ‘పైలట్ ప్రాజెక్టు’గా ఆదివారం ఇక్కడ చేపట్టిన ‘జాబ్‌మేళా-2017’ విజయవంతమైంది. హైదరాబాద్ (యూసుఫ్‌గూడ) లోని నిమ్స్‌మే (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 కంపెనీలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకునేందుకు వచ్చాయి. 2192 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 400 మందిని వివిధ కంపెనీలు తమ సంస్థల్లో నియమించుకున్నాయి. నియామకం అయిన వారికి వెంటనే నియామకపు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ జాబ్‌మేళాను ఆదివారం ఉదయం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు వేణుగోపాలాచారి, వనం జ్వాలానర్సింహారావు, సులోచన తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీల్లో క్యాంపస్ మార్గ్ 95మందిని, ఇక్సోరా(ఐసిఎస్) 50మందిని, హెచ్‌జిఎస్ కంపెనీ 44మందిని నియమించుకోగా, మిగతా వారిని టెక్‌మహేంద్ర, యోమా, బిగ్‌సి తదితర కంపెనీలు నియమించుకున్నాయి.
అభినందించిన సిఎం
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్వహించిన జాబ్‌మేళా విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడానికి జాబ్‌మేళా నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. పరిషత్ చైర్మన్ రమణాచారితో పాటు సభ్యులను ఆయన అభినందించారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి