తెలంగాణ

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 26: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సిఎం కెసిఆర్‌కు తెలిసినప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ పేరిట తప్పుదోవ పట్టిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభు త్వం విడుదల చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తుండగా, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల ఊబి లో దించిన ఘనత సిఎం కెసిఆర్ దక్కించుకున్నట్లు ఎద్దేవా చేశారు. అయితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటుండగా, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట రైతులను తప్పుదోవ పట్టిస్తూ తన చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై నెట్టి బురదజల్లుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరిట విధ్వంసం ఎంతమాత్రం తగదని, అయితే ఎన్నికల సం దర్భంగా ఇచ్చిన హామీల అమలుపై సిఎం కెసిఆర్ దృష్టి పెట్టి పేదల మన్ననలు పొందాలని సూచించారు. కాగా, ఉద్యమ సమయంలో మేథావులు, కార్మికు లు, యువకులు, సకలజనులు పోరాటాలు చేసి తెలంగాణ సాధనకు సహకరించగా, అంతా తానే చేసినట్లుగా సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.