తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మార్చి 26: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని నేరెడుగొమ్ము ఆశ్రమ పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చిం ది. ఆశ్రమ పాఠశాల వార్డెన్ విజయరాణి భర్త రాజు తమను లైంగికంగా వేధిస్తున్నాడని పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఆరోపణలు చేస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 21 వ తేదీన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసేందుకు వచ్చిన ఏటిడబ్ల్యువో పాండునాయక్‌కు విద్యార్థినులు వార్డెన్ విజయరాణి భర్త రాజు తమను లైంగికంగా వేధిస్తున్న తీరును రోదిస్తూ ఫిర్యాదు చేశారు. అయినా ఏటిడబ్ల్యువో ఏ మాత్రం స్పందించకపోవడంతో కొంతమంది విద్యార్థినులు ఓ స్వచ్ఛందసంస్థ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్ళడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వార్డెన్ భర్త రాజు అర్ధరాత్రి సమయంలో తాము పడుకున్న గదిలోకి వచ్చి ఇక్కడ ఉక్కపోస్తుంది, తన రూంకు వస్తే చల్లటి గాలి వస్తుందని తనతో తన గదికి రమ్మని వేధిస్తున్నాడని ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక రోదిస్తూ చెప్పింది. వారం రోజుల క్రితం తనకు ఇరవై రూపాయలు ఇచ్చిన వార్డెన్ భర్త రాజు తనకు ముద్దు పెట్టమని వేధించి ముద్దు పెట్టించుకున్నాడని ఆరోతరగతి చదువుతున్న మరో బాలిక రోదిస్తూ చెప్పింది. విషయం తెలుసుకున్న స్వచ్ఛందసంస్థ నిర్వాహకులు శనివారం ఆశ్రమ పాఠశాలకు వచ్చి విచారణ జరపడంతో విద్యార్థినులు తాము పాఠశాలలో అనుభవిస్తున్న దారుణాలను సదరు స్వచ్ఛందసంస్థ నిర్వాహకులకు చెప్పడంతో శనివారం రాత్రి సంస్థ నిర్వాహకులు నేరెడుగొమ్ము పోలీస్‌స్టేషన్‌లో వార్డెన్ విజయరాణి భర్త రాజుపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
విచారణ జరుపుతున్నాం
నేరెడుగొమ్ము గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ విజయరాణి భర్త రాజు పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని స్వచ్ఛందసంస్థ ఉద్యోగి కె.లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని దేవరకొండ రూరల్ సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు.