తెలంగాణ

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, మార్చి 26: సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఆదివారంతో చివరి ఘట్టానికి చేరుకుంది. సంక్రాంతి తర్వాత వచ్చిన మొదటి ఆదివారంతో స్వామివారి జాతర ప్రారంభం కాగా ఈ పదకొండవ వారంతో జాతర ముగియనుంది. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకొని మల్లన్నను దర్శించుకున్నారు. ముందుగా కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానమాచరించారు. అనంతరం గంగరేణి చెట్టు వద్ద పంచరంగులతో పట్నాలు వేసి మొక్కులను చెల్లించుకున్నారు. ఆ తర్వాత భక్తులు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం మహిళలు వారి బస చేసిన ప్రాంతాల్లో బోనాలను తయారుచేసుకొని వాటిని నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ గుట్టపై కొలువైన ఎల్లమ్మ తల్లి సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. అయితే ఆదివారం రాత్రి 7 గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగే అగ్నిగుండాలతో మల్ల న్న జాతర ముగియనుంది. ఈ ఘట్టానికి సంబంధించి అగ్నిగుండాలను రాత్రి 11 గంటలకు తయారుచేసి అగ్నిగుండాలను ప్రజ్వలన చేస్తారు. సోమవారం ఉదయం 5 గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండ ప్రవేశం, విజయోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన ఇవో రామకిషన్‌రావు తెలిపారు.