తెలంగాణ

ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: రైల్వే భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ బి వినోద్‌కుమార్ యాదవ్ రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు, సిబ్బంది అంకితభావంతో ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సికిందరాబాద్ రైల్వే నిలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లకు చెందిన అధికారులు, సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లతో పలు విభాగాలపై చర్చించారు.
సిబ్బంది టీమ్ వర్కు చేయాలని, రైల్వే భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని జిఎం వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. రైల్వే సిబ్బంది సంక్షేమంతోపాటు, ప్రయాణికుల భద్రతపై శ్రద్ధ వహించాలని, రైల్వే స్టేషన్లలో సమస్యలను అడిగి తెలుసుకోవాలని, సాధ్యమయ్యే సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, నాందేడ్, గుంటూరు, గుంతకల్లు డివిజన్‌ల మేనేజర్లు సమీక్షసమావేశంలో పాల్గొన్నారు. రైల్వే అదనపు జిఎం ఏకె గుప్తా, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ థామస్, మధుసూదన్‌రావు, ఎస్‌ఎన్ సింగ్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

చిత్రం.. రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్