తెలంగాణ

త్వరలో ఎస్సీ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఉప్పల్, మార్చి 27: దళిత గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపడానికే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులుగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేశామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా దళిత, గిరిజనులు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ గిరిజన ప్రాంతాలల్లో ఇప్పటికీ విద్య, వైద్యం, వౌళిక సదుపాయాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో అమలు చేస్తున్న నిధులు క్షేత్ర స్థాయిలో వెళ్లడంలేదన్నారు. జాతీయ కమిషన్ తరహాలో రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసి విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా అందేలా స్పెషల్ ఫోకస్ పెట్టి వెనుకబాటుతనాన్ని పారదోలాలన్నారు.
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా అన్ని విభాగాలతో కలిసి టాస్క్ఫోర్స్‌తో నిఘా పెట్టాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దశలో ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలు కోసం పకడ్భంధీ చర్యలు తీసుకోబోతున్నామన్నారు. నిధులను సక్రమంగా వినియోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు శిక్ష పడేలా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
త్వరలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని, హాస్టల్స్‌లో మెస్ చార్జీలు పెంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతకు ముందు తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపుల సవరణ బిల్లు, భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.